Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాలెంల స్టేజ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 02:29 PM

ఘనంగా రేణుక ఎల్లమ్మ తల్లి బోనాల ఉత్సవాలు

31-08-2026 47 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: మండలంలోని ఉత్తటూరు గ్రామంలో శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి బోనాల ఉత్సవాలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తటూరు BRS పార్టీ యువ నాయకుడు మేడిరాజు అమ్మవారికి బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ ప్రజలందరికీ సుఖశాంతులు, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, పంటలు సమృద్ధిగా పండేలా ఆశీర్వదించాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు. బోనాల ఉత్సవాలు మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తూ గ్రామీణ ప్రాంతాల్లో సామాజిక ఐక్యతను పెంపొందిస్తున్నాయని అన్నారు.

అనంతరం రేణుక ఎల్లమ్మ ఆలయ కమిటీ, ఉత్సవ కమిటీ సభ్యులు భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో గ్రామ ప్రజాప్రతినిధులు, మహిళలు, యువకులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

ఘనంగా రేణుక ఎల్లమ్మ తల్లి బోనాల ఉత్సవాలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News