Sthanikam - Truth Matters
Logo

ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు మేయర్‌ బుర్రి చైతన్య శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో టార్చ్‌ ర్యాలీ

Updated : 30 Aug 2026 10:29 IST
As Preferred Source 1 min read
ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు  మేయర్‌ బుర్రి చైతన్య శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో టార్చ్‌ ర్యాలీ

నల్లగొండ: జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని నల్లగొండ పట్టణంలో క్రీడా వేడుకలను మేయర్‌ బుర్రి చైతన్య శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మేయర్‌ బుర్రి చైతన్య శ్రీనివాస్‌రెడ్డి జిల్లా కలెక్టరేట్‌ నుంచి స్థానిక స్టేడియం వరకు సుమారు 2 కిలోమీటర్ల మేర నిర్వహించిన టార్చ్‌ ర్యాలీని ప్రారంభించారు. సుమారు 200 మంది క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మేయర్‌ బుర్రి చైతన్య శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. యువతలో క్రీడాస్ఫూర్తి, క్రమశిక్షణ, ఐక్యత, నాయకత్వ లక్షణాల పెంపొందింపులో క్రీడలు కీలకపాత్ర పోషిస్తాయన్నారు. జిల్లాలో క్రీడల అభివృద్ధికి అవసరమైన ప్రోత్సాహం అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు.

ప్రవళికకు సన్మానం

చైనాలో జరిగిన అంతర్జాతీయ 4×400 మీటర్ల అథ్లెటిక్స్‌ పోటీల్లో బంగారు పతకం సాధించిన డిండి గ్రామానికి చెందిన క్రీడాకారిణి ప్రవళికను మేయర్‌ బుర్రి చైతన్య శ్రీనివాస్‌రెడ్డి ఘనంగా సన్మానించారు. కలెక్టర్‌ సూచన మేరకు రూ.30 వేల నగదు ప్రోత్సాహక చెక్కును అందజేశారు. అంతర్జాతీయ స్థాయిలో రాణించి జిల్లాకు గర్వకారణంగా నిలిచిన ప్రవళికను అభినందించారు. భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించి దేశానికి, జిల్లాకు కీర్తి తీసుకురావాలని ఆకాంక్షించారు. అనంతరం వివిధ క్రీడా పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు.

Sthanikam

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి