Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్య వివాహాలను అరికట్టాలి.. బాలికల విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలి:జిల్లా సమన్వయకర్త గడ్డం పల్లవి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 08:23 PM

పోలీసులమంటూ మోసం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కంగ్టి సిఐ వెంకట్ రెడ్డి

29-08-2026 129 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

పోలీసు అధికారిగా పరిచయం చేసుకుని మీసేవ కేంద్రం నిర్వాహకుడిని నమ్మించి రూ.30 వేలు మోసం చేసిన ఘటన కంగ్టి మండలంలో చోటుచేసుకుంది. సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకట్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. కంగ్టి గ్రామానికి చెందిన మీసేవ కేంద్రం నిర్వాహకుడికి గత జూన్‌ 2న గుర్తుతెలియని వ్యక్తి ఫోన్‌ చేసి తాను కంగ్టి పోలీస్‌స్టేషన్‌ నుంచి మాట్లాడుతున్నానని, తన కుమార్తెకు ప్రమాదం జరిగిందని చెప్పాడు. తన వద్ద నగదు ఉందని, యూపీఐ ద్వారా డబ్బులు పంపితే నగదు ఇస్తానని నమ్మించడంతో నిర్వాహకుడు రూ.30 వేలు యూపీఐ ద్వారా బదిలీ చేశాడు. అనంతరం ఫోన్‌ చేయగా ఆ వ్యక్తి స్పందించకపోవడంతో అనుమానం వచ్చి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఆరా తీశాడు. దీంతో తాను సైబర్‌ మోసానికి గురైనట్లు గుర్తించి వెంటనే 1930కు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కంగ్టి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. గుర్తుతెలియని వ్యక్తులు పోలీసులమని, ఆర్మీ అధికారులమని లేదా ఇతర అధికారులమని చెప్పి డబ్బులు అడిగితే నమ్మవద్దని ప్రజలను హెచ్చరించారు. ఎవరైనా అనుమానాస్పదంగా డబ్బులు అడిగితే వెంటనే పోలీసులను సంప్రదించాలని, సైబర్‌ మోసానికి గురైతే ఆలస్యం చేయకుండా 1930కు ఫిర్యాదు చేయాలని సూచించారు.

Sthanikam

పోలీసులమంటూ మోసం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కంగ్టి సిఐ వెంకట్ రెడ్డి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News