Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / నారాయణఖేడ్

మానవత్వం చాటుకున్న మాజీ సర్పంచ్.. బాధిత కుటుంబానికి సాయం

Updated : 29 Aug 2026 19:45 IST
As Preferred Source 1 min read
మానవత్వం చాటుకున్న మాజీ సర్పంచ్.. బాధిత కుటుంబానికి సాయం

సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం ముకుంద నాయక్ తండాకు చెందిన ఆడే పుండ్లిక్ దంపతుల కుమార్తె అరుణ్ బాయి కొంతకాలంగా అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో మృతి చెందారు. దీంతో కుటుంబంలో విషాదం నెలకొంది. విషయం తెలుసుకున్న మాజీ సర్పంచ్ సురేఖ వెంకట్ రాథోడ్ తండాకు వెళ్లి మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కష్టకాలంలో కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చి, అంత్యక్రియల నిర్వహణ కోసం రూ.5,000 ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ సురేఖ వెంకట్ రాథోడ్ పదవిలో ఉన్నా లేకపోయినా ప్రజల మధ్య ఉంటూ వారి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటున్నారని, అవసరమైన సమయంలో బాధిత కుటుంబాలకు సహాయం చేస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నారని అన్నారు. కార్యక్రమంలో ఎండీఎల్‌ ప్రెసిడెంట్ రాథోడ్ సర్దార్, కాంగ్రెస్ నాయకులు, మాజీ ఉపసర్పంచ్ పరశురామ్ జాదవ్, లక్ష్మణ్, దశరథ్ నాయక్, తండా నాయక్ రమేష్, సర్పంచ్ ఆడే ప్రకాష్, ఉపసర్పంచ్ సరోజ, సంజీవ్ చవాన్, రాములు, మహీపతి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

మానవత్వం చాటుకున్న మాజీ సర్పంచ్.. బాధిత కుటుంబానికి సాయం

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news