Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 03:57 PM

అన్నకు రాఖీ కట్టేందుకు వచ్చి.. కుమారుడిని కోల్పోయిన తల్లి!

29-08-2026 223 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

రాఖీ పండుగ వేళ ఏపూర్ డీఈసీ కంపెనీలో విషాదం.. గోబర్‌ గ్యాస్‌ గుంతలో పడి రెండేళ్ల బాలుడి మృతి.

కంపెనీ భద్రతా ఏర్పాట్లపై ప్రశ్నలు.. ప్రమాదకర గుంతల చుట్టూ రక్షణ చర్యలు ఉన్నాయా?

చిట్యాల:

అన్నకు రాఖీ కట్టేందుకు వచ్చిన ఆ కుటుంబంలో అంతులేని విషాదం నెలకొంది. రాఖీ పండుగ సందర్భంగా అన్నను కలిసేందుకు వచ్చిన ఓ మహిళ.. చివరకు తన రెండేళ్ల కుమారుడిని కోల్పోయి కన్నీరుమున్నీరుగా విలపించింది. ఈ విషాద ఘటన చిట్యాల మండలం ఏపూర్ గ్రామ పరిధిలోని డీఈసీ కంపెనీలో శుక్రవారం చోటుచేసుకుంది.

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ సత్యసాయి జిల్లా కదిరి ప్రాంతానికి చెందిన రాజేష్‌కుమార్ కొంతకాలంగా డీఈసీ కంపెనీలో పనిచేస్తున్నాడు. రాఖీ పండుగ సందర్భంగా అతడి సోదరి, ఆమె భర్త అజయ్ పండిట్, కుమారుడు ఆర్యన్ కుమార్ (2)తో కలిసి కంపెనీకి వచ్చారు.

కనిపించకుండా పోయి.. చివరకు గుంతలో.

శుక్రవారం ఉదయం సుమారు 9 గంటల సమయంలో చిన్నారి ఆర్యన్ ఇంటి నుంచి బయటకు వెళ్లి కంపెనీ పరిసరాల్లోకి వెళ్లాడు. కొంతసేపటి తర్వాత బాలుడు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. కంపెనీ పరిసరాల్లో, చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించినా బాలుడి ఆచూకీ లభించలేదు.ఈ క్రమంలో మధ్యాహ్నం 12.30 గంటల తర్వాత కంపెనీ పరిసరాల్లోని గోబర్‌ గ్యాస్‌ గుంతలో బాలుడు పడి ఉన్నట్లు గుర్తించారు. వెంటనే బయటకు తీసినప్పటికీ అప్పటికే బాలుడు మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. రాఖీ పండుగ రోజున చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.

భద్రతా ఏర్పాట్లు ఎక్కడ?

కంపెనీ పరిసరాల్లో ప్రమాదకరమైన గుంతలు ఉన్నప్పటికీ.. రెండేళ్ల చిన్నారి అక్కడికి వెళ్లే పరిస్థితి ఎలా ఏర్పడిందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. చిన్నారులు కంపెనీ పరిసరాల్లోకి వెళ్లకుండా ఎలాంటి భద్రతా చర్యలు చేపట్టారు?

ప్రమాదకర గుంతలకు రక్షణ కంచెలు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారా? అనే అంశాలపై స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

బాలుడి మృతికి దారితీసిన పరిస్థితులపై సంబంధిత అధికారులు సమగ్ర విచారణ చేపట్టి, కంపెనీ పరిసరాల్లో భద్రతా ప్రమాణాలను పరిశీలించాలని స్థానికులు కోరుతున్నారు.

Sthanikam

అన్నకు రాఖీ కట్టేందుకు వచ్చి.. కుమారుడిని కోల్పోయిన తల్లి!

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News