Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / యాదాద్రి భువనగిరి

గుంతలు పూడ్చిన ఆటో యూనియన్‌ సభ్యులు.

Updated : 28 Aug 2026 19:17 IST
As Preferred Source 1 min read
గుంతలు పూడ్చిన ఆటో యూనియన్‌ సభ్యులు.

రామన్నపేట, ఆగస్టు 28: రహదారిపై ఏర్పడిన గుంతలతో ఇబ్బందులు పడుతున్న వాహనదారులకు ఆటో యూనియన్‌ సభ్యులు అండగా నిలిచారు. రామన్నపేట మండల కేంద్రం నుంచి అమ్మనబోలు వెళ్లే రహదారిపై గుంతలను శ్రీ మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి ఆటో యూనియన్‌ ఆధ్వర్యంలో శుక్రవారం శ్రమదానం చేసి పూడ్చారు.

నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగించే ఈ రహదారిపై గుంతలు ఏర్పడి ప్రమాదాలకు కారణమవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని యూనియన్‌ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో గుంతల్లో మట్టి పోసి తాత్కాలికంగా పూడ్చి వాహనదారులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టామన్నారు.

అధికారులు స్పందించి రహదారికి శాశ్వత మరమ్మతులు చేపట్టి ప్రయాణికుల కష్టాలు తీర్చాలని కోరారు. కార్యక్రమంలో యూనియన్‌ అధ్యక్షుడు తుర్కపల్లి ఉప్పలయ్య, మేకల రాములు, కప్పుల రమేష్‌, గంటెపాక బిక్షం, లక్ష్మయ్యచారి, ఎండీ మజ్జు, బొంగు బిక్షం తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

గుంతలు పూడ్చిన ఆటో యూనియన్‌ సభ్యులు.

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news