అన్నాచెల్లెళ్ల ఆత్మీయ అనుబంధానికి ప్రతీకగా నిలిచే పవిత్రమైన రక్షాబంధన్ పండుగను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించాలని వీరశైవ లింగాయత్ సమాజం జిల్లా సలహాదారు, సదాశివపేట సమాజం కార్యనిర్వాహక అధ్యక్షులు అనిమిశెట్టి జయప్రకాశ్ అన్నారు.రక్షాబంధన్ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సోదరీమణులు తమ సోదరులకు రాఖీ కట్టి, వారి ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలను కోరుకుంటారని తెలిపారు. సోదరులు తమ సోదరీమణులకు అండగా నిలుస్తామని, జీవితాంతం రక్షణగా ఉంటామని హామీ ఇవ్వడం ఈ పండుగ ప్రత్యేకత అని పేర్కొన్నారు.రక్షాబంధన్ పండుగ కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, ఆప్యాయత, అనురాగాలను మరింత బలపరుస్తుందని, భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనాన్ని చాటిచెబుతుందని అన్నారు. ప్రతి ఒక్కరూ రక్షాబంధన్‌ను సంతోషంగా జరుపుకొని, సోదర–సోదరీమణుల మధ్య ప్రేమానుబంధాలను మరింత పెంపొందించుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో అమ్మిశెట్టి వీర్‌కుమార్, సాయి, బత్తుల రాజు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి