Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:09 PM

రాఖీ కట్టి సోదరభావాన్ని చాటిన మహిళలు.. నీలం మధు ఆప్యాయ పలకరింపు

28-08-2026 51 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి నీలం మధు ముదిరాజ్ నివాసంలో శుక్రవారం రక్షాబంధన్ వేడుకలు ఆత్మీయంగా జరిగాయి. ఈ సందర్భంగా పలువురు మహిళలు, సోదరీమణులు నీలం మధుకు రాఖీలు కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు చూపిన ఆప్యాయతకు నీలం మధు కృతజ్ఞతలు తెలియజేస్తూ, వారికి మిఠాయిలు అందించి సోదరభావంతో పలకరించారు. ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ రక్షాబంధన్ పండుగ అన్నాచెల్లెళ్ల మధ్య ఉండే ప్రేమ, ఆప్యాయత, నమ్మకం, అనుబంధానికి ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. రాఖీ కట్టడం కేవలం ఒక సంప్రదాయం మాత్రమే కాదని, ఒకరిపై ఒకరికి ఉన్న నమ్మకాన్ని, ఆప్యాయతను చాటే పవిత్రమైన బంధమని పేర్కొన్నారు. సమాజంలో ప్రతి మహిళ గౌరవంగా, స్వేచ్ఛగా, భద్రంగా జీవించే వాతావరణం కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. మహిళల అభ్యున్నతి, సాధికారతకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని తెలిపారు.రక్షాబంధన్ వంటి పండుగలు కుటుంబ సభ్యుల మధ్యనే కాకుండా సమాజంలోని ప్రతి ఒక్కరి మధ్య సోదరభావం, ఆత్మీయత, ఐక్యతను పెంపొందిస్తాయని నీలం మధు అన్నారు. మహిళల పట్ల గౌరవం, భద్రతతో కూడిన సమాజ నిర్మాణానికి అందరూ కలిసి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

Sthanikam

రాఖీ కట్టి సోదరభావాన్ని చాటిన మహిళలు.. నీలం మధు ఆప్యాయ పలకరింపు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News