Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాలెంల స్టేజ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 01:32 PM

సౌత్‌-ఈస్ట్‌ ఏషియన్‌ కప్‌కు తెలంగాణ నుంచి ముగ్గురు

27-08-2026 393 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

తెలంగాణ క్రీడారంగానికి మరో అరుదైన గుర్తింపు లభించింది. ఒలింపిక్స్‌లో అధికారిక క్రీడగా గుర్తింపు పొందిన లాక్రోస్‌ సౌత్‌-ఈస్ట్‌ ఏషియన్‌ కప్‌ ఛాంపియన్‌షిప్‌–2026కు రాష్ట్రం నుంచి ముగ్గురు క్రీడాకారులు ఎంపికయ్యారు.

ఆగస్టు 28, 29, 30 తేదీల్లో మలేషియాలోని కౌలాలంపూర్‌లో జరిగే పోటీల్లో వీరు భారత జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు.

ఎంపికైన వారిలో ఆకాష్, కరంతూత్, చిర్రబోయిన సంగీత యాదవ్, గోపిక ఉన్నారు. నల్గొండకు చెందిన గోపికతో పాటు ఎంపికైన క్రీడాకారులు ఫిజికల్‌ డైరెక్టర్‌ అంజలి యాదవ్, తెలంగాణ లాక్రోస్‌ ప్రధాన కోచ్‌ ఎ. శివకుమార్‌ పర్యవేక్షణలో శిక్షణ పొందారు.

అసోసియేషన్‌ అభినందనలు

తెలంగాణ లాక్రోస్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు డాక్టర్‌ ఎం.డి. లతీఫుద్దీన్‌, ప్రధాన కార్యదర్శి కె. భానుచందర్‌ ఎంపికైన క్రీడాకారులు, వారి తల్లిదండ్రులు, కోచ్‌లను అభినందించారు.

మలేషియాలో జరిగే పోటీల్లో ప్రతిభ కనబరిచి దేశానికి, రాష్ట్రానికి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. కొత్త క్రీడాకారులు, కోచ్‌లను ప్రోత్సహిస్తూ అవసరమైన సహకారం అందించేందుకు అసోసియేషన్‌ ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు. కె. భానుచందర్‌ నేతృత్వంలో ఇప్పటికే పలువురు క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో లాక్రోస్‌లో రాణించడం విశేషం.

Sthanikam

సౌత్‌-ఈస్ట్‌ ఏషియన్‌ కప్‌కు తెలంగాణ నుంచి ముగ్గురు

Article Image

మీ స్పందన? 3 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News