Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తడ్కల్‌లో మహమ్మద్ ప్రవక్త జన్మదిన వేడుకలు.. భారీ ర్యాలీలో పాల్గొన్న యువత, ప్రజలు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 07:44 PM

కలెక్టరేట్‌ ధర్నాను విజయవంతం చేయండి...

కలెక్టరేట్‌ ధర్నాను విజయవంతం చేయండి...

కలెక్టరేట్‌ ధర్నాను విజయవంతం చేయండి...
26-08-2026 25 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District Bureau Nalagonda
NM Yadav

టీఎస్‌ యుటిఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి పిలుపు

సమస్యలు పరిష్కరించకుంటే సెప్టెంబరు 10న 'చలో హైదరాబాద్‌'..

నల్లగొండ : ఉపాధ్యాయులు, ఉద్యోగు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 27న (గురువారం) నల్లగొండ జిల్లా కలెక్టరేట్‌ ఎదుట నిర్వహించే ధర్నా కార్యక్రమాన్ని ఉపాధ్యాయులంతా తరలివచ్చి విజయవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్‌ యుటిఎఫ్‌) రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం. రాజశేఖర్‌రెడ్డి పిలుపునిచ్చారు.

​నల్లగొండలోని జిల్లా యుటిఎఫ్ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు బక్క శ్రీనివాస్‌చారి అధ్యక్షతన బుధవారం ఆఫీస్‌ బేరర్ల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ.. పీఆర్‌సీ గడువు ముగిసి మూడేళ్లు దాటినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం శోచనీయమన్నారు.ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి పెరుమాళ్ల వెంకటేశం మాట్లాడుతూ.. ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా సీపీఎస్‌ విధానాన్ని వెంటనే రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని (ఓపీఎస్‌) పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఎంప్లాయీస్ హెల్త్ కార్డ్‌ (ఈహెచ్‌ఎస్)లోని అసంబద్ధతలను తొలగించి మెరుగైన వైద్యం అందించాలని, పెండింగ్‌లో ఉన్న 6 డీఏ (DA)లను వెంటనే విడుదల చేయాలని కోరారు. ప్రభుత్వం స్పందించని పక్షంలో సెప్టెంబరు 10న ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో ‘చలో హైదరాబాద్‌’ మహాధర్నా చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎఫ్‌డబ్ల్యూఎఫ్‌ రాష్ట్ర కోశాధికారి ఎడ్ల సైదులు, జిల్లా ఉపాధ్యక్షులు బడుగు అరుణ, నర్రా శేఖర్‌రెడ్డి, కోశాధికారి వడిత్య రాజు, సీహెచ్‌ అరుణ, జిల్లా కార్యదర్శులు గేర నరసింహ, యాట మధుసూదన్‌రెడ్డి, నలపరాజు వెంకన్న, పగిళ్ల సైదులు, యాదగిరి, గంటల వెంకటయ్య, చిన్న వెంకన్న, కొమరాజు సైదులు, శ్రీలత, భాను ప్రకాష్‌, రాగి రాకేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

కలెక్టరేట్‌ ధర్నాను విజయవంతం చేయండి...

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News