Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 10:37 AM

గొర్రెల దొంగతనం కేసును ఛేదించిన రామగిరి పోలీసులు..

26-08-2026 21 Views
Reporter
స్థానికం ప్రతినిధి : శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali

రామగిరి మండలం సుద్దకొండపల్లి గ్రామానికి చెందిన కురుబ బిల్లే నాగరాజు తన గొర్రెల మందను కాపాడేందుకు రొద్దం మండలం పెద్దకోటిపల్లి గ్రామానికి చెందిన సుబ్రహ్మణ్యం (28)ను గొర్రెల కాపరిగా నియమించుకున్నాడు.

ఈ క్రమంలో సుబ్రహ్మణ్యం మరో ఇద్దరు వ్యక్తుల సహకారంతో యజమానికి చెందిన సుమారు 81 గొర్రెలను మంద నుంచి తప్పించి, సుమారు 15 కిలోమీటర్ల దూరం వరకు తోలుకొని వెళ్లినట్లు పోలీసుల దృష్టికి వచ్చింది. దొంగిలించబడిన గొర్రెల విలువ సుమారు రూ.12 లక్షలు ఉంటుందని యజమాని తెలిపాడు.

సమాచారం అందుకున్న వెంటనే రామగిరి పోలీసులు అప్రమత్తమై, గొర్రెల కదలికలను మరియు నిందితుల ఆచూకీని ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తూ గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసుల నిరంతర పర్యవేక్షణతో తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో గొర్రెలను గుర్తించి, సురక్షితంగా స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వాటిని యజమానికి అప్పగించినట్లు సిఐ మహమ్మద్ అలీ తెలిపారు.

పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్న సమయంలో గొర్రెలను తరలించిన వ్యక్తితో పాటు వచ్చిన మరో ఇద్దరు వ్యక్తులు అక్కడి నుంచి పరారయ్యారు. పరారైన నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నట్లు సిఐ తెలియజేశారు.

ఈ కేసులో రామగిరి ఎస్‌ఐ ప్రదీప్ రాజ్ ఆధ్వర్యంలో హెడ్ కానిస్టేబుల్ శాశవళి, కానిస్టేబుళ్లు ముక్కనేశ్వర, లక్ష్మీనారాయణ రెడ్డి సమర్థవంతంగా పనిచేశారు. సమయస్ఫూర్తితో స్పందించి, గొర్రెలను త్వరితగతిన గుర్తించి సురక్షితంగా స్వాధీనం చేసుకోవడంలో వారు కీలక పాత్ర పోషించారు.

గొర్రెలు, పశువులు పెంచుకునే రైతులు మరియు కాపరులు మరింత అప్రమత్తంగా ఉండాలని రామగిరి పోలీసులు సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలు లేదా కదలికలు కనిపించిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని కోరారు.

Sthanikam

గొర్రెల దొంగతనం కేసును ఛేదించిన రామగిరి పోలీసులు..

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News