Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గొర్రెల దొంగతనం కేసును ఛేదించిన రామగిరి పోలీసులు.. అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 05:20 PM

ఏపీలో నూతన పెన్షన్లకు ఆహ్వానం

ఏపీలో నూతన పెన్షన్లకు ఆహ్వానం

ఏపీలో నూతన పెన్షన్లకు ఆహ్వానం
26-08-2026 8 Views
Reporter
స్థానికం ప్రతినిధి : శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ భరోసా పథకం కింద మరో 3 లక్షల మందికి కొత్తగా సామాజిక భద్రత పింఛన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.సెప్టెంబర్ రెండో వారం నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుండగా.. అక్టోబర్ నుంచి కొత్త పింఛన్ల పంపిణీ చేపట్టనున్నారు.

మొదటి ప్రాధాన్యతగా వితంతువులు, వృద్ధులకు పింఛన్లు అందించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో సుమారు 1.70 లక్షల మంది వితంతువులు గుర్తించగా.. పరిశీలన అనంతరం సుమారు 1.50 లక్షల మంది అర్హులుగా ప్రాథమికంగా తేలారు.

మిగిలిన 1.50 లక్షల పింఛన్లను వృద్ధులకు ఇవ్వనున్నారు. గత ప్రభుత్వ హయాంలో అర్హత ఉన్నప్పటికీ పింఛను పొందని వారు దాదాపు లక్ష మంది ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.

అదే విధంగా చర్మకారులు, దప్పు కళాకారులు, చేనేత, గీత కార్మికులు వంటి వృత్తిపరమైన వర్గాల వివరాలను కూడా ప్రభుత్వం సేకరిస్తోంది. ఈ కేటగిరీల్లో 60 నుంచి 70 వేల మంది వరకు ఉండొచ్చని అంచనా.

దివ్యాంగుల పింఛన్ల విషయంలో అర్హత లేని వారికి కూడా ధ్రువీకరణ పత్రాలు జారీ అయినట్లు గుర్తించడంతో అధికారులు దీనిపైనా పరిశీలన చేస్తున్నారు.అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్ అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.

Sthanikam

ఏపీలో నూతన పెన్షన్లకు ఆహ్వానం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News