Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / హైదరాబాద్

ఇద్దరు చిన్నారులతో మహిళ అదృశ్యం

Updated : 26 Aug 2026 08:31 IST
As Preferred Source 1 min read
ఇద్దరు చిన్నారులతో మహిళ అదృశ్యం

ఎల్బీనగర్, ఆగస్టు 25 (స్థానికం): ఇద్దరు చిన్నారులతో కలిసి ఓ మహిళ అదృశ్యమైన ఘటన సరూర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సీఐ శ్రీశైలం తెలిపిన వివరాల ప్రకారం.. అలేటి సుజాత (25) భర్తతో గొడవ కారణంగా చంపాపేటలోని తన తల్లి వెంకటమ్మ వద్ద ఇద్దరు పిల్లలతో కలిసి ఉంటోంది.

ఈ నెల 16న రాత్రి 9.30 గంటల సమయంలో సుజాత తన తల్లి కుటుంబ సభ్యులతో గొడవపడి.. తన ఇద్దరు పిల్లలు అలేటి చిట్టిబాబు (6), అలేటి నవ్యశ్రీ (1.5)లను వెంట తీసుకుని ఇంటి నుంచి బయటకు వెళ్లింది. అనంతరం తిరిగి ఇంటికి రాలేదు. కుటుంబ సభ్యులు బంధువులు, స్నేహితులు, తెలిసిన వారి వద్ద ఆరా తీసినా ఆచూకీ లభించలేదు.

దీంతో సుజాత తల్లి వెంకటమ్మ ఫిర్యాదు మేరకు సరూర్‌నగర్ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఆచూకీ తెలిస్తే సమాచారం ఇవ్వండి:

మహిళ సుజాతతో పాటు ఇద్దరు చిన్నారులను ఎవరైనా చూసినా, వారి ఆచూకీకి సంబంధించిన సమాచారం తెలిసినా వెంటనే సమీప పోలీస్‌స్టేషన్‌కు లేదా సరూర్‌నగర్ పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందించాలని సీఐ శ్రీశైలం కోరారు.

Sthanikam

ఇద్దరు చిన్నారులతో మహిళ అదృశ్యం

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news