Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / యాదాద్రి భువనగిరి

కానిస్టేబుల్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రామాచారి

Updated : 26 Aug 2026 07:13 IST
As Preferred Source 1 min read
కానిస్టేబుల్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రామాచారి

రామన్నపేట: తెలంగాణ రాష్ట్ర పోలీస్‌ అసోసియేషన్‌ ఎన్నికల్లో భాగంగా రామన్నపేట సర్కిల్‌ కానిస్టేబుల్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా ఏ. రామాచారి ఎన్నికయ్యారు. మంగళవారం స్థానిక సీఐ ఎం. రవి ఎన్నికల అధికారిగా వ్యవహరించారు.

రామన్నపేట సర్కిల్‌ పరిధిలోని ఐదు మండలాలకు చెందిన కానిస్టేబుళ్లు ఎన్నికల్లో పాల్గొన్నారు. అధ్యక్ష పదవికి పోటీ చేసిన ఐదుగురు అభ్యర్థుల్లో రామాచారికి అత్యధిక ఓట్లు లభించడంతో ఆయన విజయం సాధించారు.

ఈ సందర్భంగా ఎన్నికైన రామాచారిని పోలీస్‌ సిబ్బంది, మిత్రులు పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం రామాచారి మాట్లాడుతూ కానిస్టేబుళ్ల సంక్షేమానికి, వారి సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ కృషి చేస్తానని తెలిపారు.

Sthanikam

కానిస్టేబుల్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రామాచారి

Article Image

రామన్నపేట: తెలంగాణ రాష్ట్ర పోలీస్‌ అసోసియేషన్‌ ఎన్నికల్లో భాగంగా రామన్నపేట సర్కిల్‌ కానిస్టేబుల్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా ఏ. రామాచారి ఎన్నికయ్యారు. మంగళవారం స్థానిక సీఐ ఎం. రవి ఎన్నికల అధికారిగా వ్యవహరించారు.

రామన్నపేట సర్కిల్‌ పరిధిలోని ఐదు మండలాలకు చెందిన కానిస్టేబుళ్లు ఎన్నికల్లో పాల్గొన్నారు. అధ్యక్ష పదవికి పోటీ చేసిన ఐదుగురు అభ్యర్థుల్లో రామాచారికి అత్యధిక ఓట్లు లభించడంతో ఆయన విజయం సాధించారు.

ఈ సందర్భంగా ఎన్నికైన రామాచారిని పోలీస్‌ సిబ్బంది, మిత్రులు పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం రామాచారి మాట్లాడుతూ కానిస్టేబుళ్ల సంక్షేమానికి, వారి సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ కృషి చేస్తానని తెలిపారు.

మరిన్ని

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news