భువనగిరి: జిల్లాలో దొంగతనాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఎస్పీ అక్షాన్ష్ యాదవ్ ఐపీఎస్ పోలీసు అధికారులను ఆదేశించారు. ఆటోమొబైల్ దొంగతనాలు, ఇళ్లలో చోరీలు, స్నాచింగ్లు తదితర నేరాల నియంత్రణపై భువనగిరి డివిజన్ పోలీసు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
నేరాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని, రాత్రి వేళల్లో పెట్రోలింగ్ ముమ్మరం చేయాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులను తనిఖీ చేయడంతోపాటు వారి కదలికలపై నిఘా ఉంచాలన్నారు. నేరాల నియంత్రణకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించాలని ఆదేశించారు.
సమావేశంలో భువనగిరి డీఎస్పీ రవీందర్, సీఐ చంద్రబాబు, సీసీఎస్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్బాబు, ఎస్ఐలు అనిల్, శ్రీశైలం, ఐటీ సెల్ ఇన్చార్జి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి