సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం మానూర్ మండలం బోరంచ గ్రామ శివారులో మంజీరా నది ఒడ్డున వెలసిన ప్రసిద్ధ శ్రీ నల్లపోచమ్మ అమ్మవారిని గురువారం జిల్లా మహిళా సాధికారత కేంద్రం జిల్లా సమన్వయకర్త గడ్డం పల్లవి దర్శించుకున్నారు.శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కులు చెల్లించుకున్నారు.అనంతరం ఆలయ అర్చకులు శ్రీకాంత్ స్వామి, సిద్ధు స్వామి, నాగేష్ స్వామి, ప్రవీణ్ స్వామి అమ్మవారికి నైవేద్యం సమర్పించారు.ఈ సందర్భంగా ఆలయ అర్చకులు గడ్డం పల్లవిని శాలువాతో ఘనంగా సత్కరించారు.అనంతరం పల్లవి మాట్లాడుతూ,శ్రీ నల్లపోచమ్మ అమ్మవారి ఆశీస్సులు జిల్లా ప్రజలతో పాటు మానూర్ మండల ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని, ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలతో,ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకుంటూ ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపారు. అమ్మవారి కృపతో ప్రజలందరికీ మంచి జరగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలోఫైనాన్షియల్ స్పెషలిస్ట్ పుల్కంటి నర్సింలు,ఆలయ సిబ్బంది శేఖర్, సందీప్ కూమార్, గ్రామ పెద్దలు గ్రామస్తులు యువత యువకులు భక్తులు తదితరులు పాల్గొన్నారు.
శరన్నవరాత్రి వేడుకల్లో నల్లపోచమ్మ అమ్మవారిని దర్శించుకున్న పల్లవి

Krishna

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి