Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 09:00 AM

కిట్స్ మహిళా కళాశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

15-10-2026 7 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

కోదాడ పట్టణంలోని కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో బతుకమ్మ సంబురాలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థినులు అమ్మవారి తొమ్మిది అవతారాల్లో అలంకరించుకుని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. స్వయంగా బతుకమ్మలను పేర్చి తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను చాటారు.

ఈ సందర్భంగా కళాశాల వైస్ చైర్మన్ నీలా అరుణదేవి విద్యార్థినులను అభినందించారు. మున్సిపల్ చైర్‌పర్సన్ ఎర్నేని కుసుమ మాట్లాడుతూ బతుకమ్మ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని అన్నారు. మున్సిపల్ కమిషనర్ రమాదేవి మాట్లాడుతూ ఈ పండుగ ప్రకృతిని ప్రేమించడం, సంప్రదాయాలను గౌరవించడం, ఐకమత్యంతో జీవించడం నేర్పుతుందని తెలిపారు. మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ దేవరపల్లి మల్లేశ్వరి మాట్లాడుతూ బతుకమ్మ తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయ వేడుక అని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ నీలా సత్యనారాయణ, నీలా పాండురమ్మ, ప్రిన్సిపాల్ గాంధీ, అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు. బతుకమ్మ ఆటపాటలతో కళాశాల ప్రాంగణం సందడిగా మారింది.

Sthanikam

కిట్స్ మహిళా కళాశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News