అరుదైన గ్రంథాల పరిరక్షణపై అధ్యయనం
హైదరాబాద్: తెలంగాణలోని వివిధ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలకు చెందిన గ్రంథపాలకుల బృందం ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ గ్రంథాలయాలను సందర్శించింది. గుంటూరులోని ప్రాంతీయ గ్రంథాలయం, తిక్కన గ్రంథాలయం, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ కేంద్ర గ్రంథాలయం, గ్రంథాలయ శాస్త్ర విభాగాన్ని పరిశీలించింది.
ఈ సందర్భంగా గ్రంథాలయాల నిర్వహణ, డిజిటల్ సేవలు, అరుదైన పుస్తకాల సంరక్షణపై అధ్యయనం చేశారు. గ్రంథాలయాలు భావితరాలకు విజ్ఞాన సంపదను అందించే కేంద్రాలని గ్రంథపాలకులు పేర్కొన్నారు. తాళపత్ర గ్రంథాలు, పురాతన పుస్తకాలను పరిరక్షించడంతోపాటు విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంపొందించాలని సూచించారు.
ఈ యాత్రలో డా. దుర్గా ప్రసాద్, డా. మాతంగి యాకూబ్, డా. నాగరాజు, డా. జగదీష్, డా. రవి కుమార్ చేగోని పాల్గొన్నారు. గ్రంథాలయాల అభివృద్ధికి ప్రభుత్వాలు, విద్యావేత్తలు సమిష్టిగా కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి