Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
విధుల్లో ప్రతిభకు గుర్తింపు.. ప్రేమ్ కుమార్‌కు ప్రశంసా పత్రం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 14, 2026 11:21 PM

చౌటుప్పల్‌లో కన్నులపండువగా ‘బతుకమ్మ’ సంబరాలు!

14-10-2026 86 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

పురపాలక సంఘం ఆధ్వర్యంలో శోభాయాత్ర.. అలరించిన ఆటపాటలు

ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి సహకారంతో మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతాం: చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్

చౌటుప్పల్ పురపాలక సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకైన బతుకమ్మ సంబరాలను బుధవారం అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మున్సిపల్ చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ సారథ్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో పట్టణ మహిళలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, మహిళా సంఘాల సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ​పట్టణంలోని వివిధ వార్డుల నుంచి కౌన్సిలర్లు, మహిళలు బతుకమ్మలతో తరలిరాగా.. శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం నుంచి గాంధీ పార్క్ వరకు కన్నులపండువగా శోభాయాత్ర నిర్వహించారు. అనంతరం గాంధీ పార్క్‌లో మహిళలందరూ ఒకచోట చేరి సంప్రదాయబద్ధంగా బతుకమ్మలను పేర్చి, ఉత్సాహంగా ఆటపాటలతో సందడి చేశారు.ఈ సందర్భంగా చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవానికి, ప్రకృతి ఆరాధనకు, ఐకమత్యానికి ప్రతీక అని పేర్కొన్నారు. పట్టణ ప్రజలందరూ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో చౌటుప్పల్‌ను పరిశుభ్రత, పచ్చదనం, మౌలిక సదుపాయాల కల్పనలో రాష్ట్రంలోనే ఆదర్శ పురపాలక సంఘంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ వేడుకల్లో మున్సిపల్ కమిషనర్ ఎం. వెంకటేశ్వర నాయక్, వైస్ చైర్మన్ గోశిక వినయ్ కుమార్, కౌన్సిలర్లు కొసనం రాకేష్ రెడ్డి, పోలేపల్లి లక్ష్మి, పల్లె లావణ్య, ఉదరి యాదయ్య, కొయ్యడ శేఖర్, ఆలె శ్రీలత, కాసర్ల మంజుల, బద్రి గాలయ్య, దేప రమ్య, పాక చిరంజీవి, బత్తుల వాణి, ఉడుగు జ్యోతి, గడ్డం ఇందిర, బత్తుల జయమ్మ, చింతల ఉమామహేశ్వరి, బుడ్డ సురేష్, పిల్లలమర్రి మధుసూదన్, హన్ను మహమ్మద్,​ కో-ఆప్షన్ సభ్యులు పస్తం గంగారాములు, సందగళ్ల విజయ, మహమ్మద్ బాబా షరీఫ్, షేక్ నబీబి, మున్సిపల్ మేనేజర్ శ్రీధర్ రెడ్డి, ఆర్.ఓ. అంజయ్య, పర్యావరణ ఇంజనీర్ రేణు కుమార్, కార్యాలయ సిబ్బంది, పారిశుధ్య కార్మికులు, ఆర్‌పీలు, స్వయం సహాయక సంఘాల మహిళలు, పట్టణ ప్రజలు విశేష సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

చౌటుప్పల్‌లో కన్నులపండువగా ‘బతుకమ్మ’ సంబరాలు!

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News