తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు చాటిచెప్పేలా వేడుకలు
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకుని మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ మండలం ముత్వెల్లిగూడలోని ఎస్ఆర్ స్కూల్లో బుధవారం బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. పాఠశాల కరస్పాండెంట్ నెల్లూరు శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో విద్యార్థినులు, ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
విద్యార్థినులు రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి, సంప్రదాయ దుస్తుల్లో వేడుకల్లో పాల్గొన్నారు. బతుకమ్మల చుట్టూ చేరి పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ సందడి చేశారు. దీంతో పాఠశాల ప్రాంగణం పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది.
ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ నెల్లూరు వసంత మాట్లాడుతూ.. విద్యార్థులకు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, పండుగల విశిష్టతను తెలియజేసేందుకు ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని తెలిపారు. కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి