చిట్యాల: రోడ్డు భద్రతలో భాగంగా వాహనదారులు, డ్రైవర్ల ఆరోగ్యం, కంటి చూపుపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. నల్గొండ జిల్లా ఎస్పీ శరత్‌చంద్ర పవార్ సూచనల మేరకు చిట్యాల పోలీసుల ఆధ్వర్యంలో బుధవారం వెలిమినేడు గ్రామంలోని జాతీయ రహదారి పక్కన ఉన్న శివమ్ గార్డెన్స్ అండ్ ఫంక్షన్ హాల్‌లో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించనున్నారు.
ఉదయం 9 గంటల నుంచి జరిగే శిబిరంలో లారీ, ఆటో, క్యాబ్ డ్రైవర్లతో పాటు ఇతర వాహనదారులకు కంటి పరీక్షలు నిర్వహించి వైద్య నిపుణులు అవసరమైన సలహాలు, సూచనలు అందించనున్నారు. అవసరమైన వారికి ఉచితంగా కంటి అద్దాలు అందజేయనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా ఎస్పీ శరత్‌చంద్ర పవార్, నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి హాజరుకానున్నారు. డ్రైవర్లు, వాహనదారులు పెద్ద సంఖ్యలో పాల్గొని శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని చిట్యాల పోలీసులు కోరారు. ఆరోగ్యకరమైన కంటి చూపు.. సురక్షిత ప్రయాణానికి కీలకమని పేర్కొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి