సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని 31వ, 11వ వార్డుల్లో రూ.80 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులను మున్సిపల్ చైర్మన్ కూన వనిత సంతోష్ ప్రారంభించారు.ఈ సందర్భంగా ముఖ్య అతిథి నిర్మలా జగ్గారెడ్డి మాట్లాడుతూ,పట్టణంలోని అన్ని వార్డులను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పార్టీలకు అతీతంగా ప్రజలకు అవసరమైన పనులు చేపడుతున్నామని తెలిపారు.ప్రజల అవసరాలను గుర్తించి అభివృద్ధి పనులకు ప్రాధాన్యతనిస్తున్న మున్సిపల్ చైర్మన్తో పాటు పాలకవర్గ సభ్యులను అభినందించారు.అనంతరం మున్సిపల్ చైర్మన్ కూన వనిత సంతోష్ మాట్లాడుతూ,పట్టణ ప్రజలకు మెరుగైన రహదారులు,మౌలిక సదుపాయాలు కల్పించడమే తమ లక్ష్యమని, సంగారెడ్డి పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్లు సతీశ్ రెడ్డి,దశరథ్ రెడ్డి,శ్రీకాంత్ గౌడ్,పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు కిరణ్ గౌడ్,నాయకులు కూన సంతోష్,తులసిరామ్,శ్రీశైలం,అన్వర్,రామచందర్ గౌడ్, జైపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సంగారెడ్డి అభివృద్ధే ధ్యేయంగా ముందుకు.. రూ.80 లక్షలతో రోడ్ల పనులు

Krishna

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి