Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బ్రిడ్జి నిర్మాణంతో ప్రజలు, వ్యాపారులకు ఇబ్బందులు కలగొద్దు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 13, 2026 09:17 PM

బ్రిడ్జి నిర్మాణంతో ప్రజలు, వ్యాపారులకు ఇబ్బందులు కలగొద్దు

13-10-2026 21 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

మున్సిపల్ చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్

రహదారి పనులపై అఖిలపక్ష సమావేశం, క్షేత్రస్థాయి పరిశీలన

జాతీయ రహదారి–65పై బ్రిడ్జి నిర్మాణ పనుల కారణంగా పండుగ వేళ ప్రజలు, వాహనదారులు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారికి ఎలాంటి అంతరాయం కలగకుండా తక్షణ చర్యలు చేపట్టాలని చౌటుప్పల్ మున్సిపల్ చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ అధికారులను ఆదేశించారు. చౌటుప్పల్ మున్సిపల్ కార్యాలయంలో ఆమె ఆధ్వర్యంలో మంగళవారం అఖిలపక్ష సమావేశం నిర్వహించారు.​ఈ సందర్భంగా చైర్‌పర్సన్ మాట్లాడుతూ.. చిన్న కొండూరు రోడ్డు నుంచి తంగడపల్లి రోడ్డుకు రాకపోకల మార్గాన్ని తక్షణమే పునరుద్ధరించాలని, అలాగే వలిగొండ రోడ్డు వద్ద యూటర్న్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురావాలని స్పష్టం చేశారు. ఈ రెండు మార్గాల ద్వారా రాకపోకలు సులభతరం చేయాలని సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించారు.​అనంతరం కౌన్సిలర్లు, అఖిలపక్ష నాయకులు, జాతీయ రహదారి నిర్మాణ సంస్థ ప్రతినిధులు వి.ఆర్. జోషితో కలిసి క్షేత్రస్థాయిలో పనులను పరిశీలించారు. పట్టణ అభివృద్ధితో పాటు ప్రజల ప్రయాణ సౌకర్యాలు, వ్యాపారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని జాతీయ రహదారి సంస్థ అధికారులు సమన్వయంతో పనిచేయాలని కోరారు. సమావేశంలో ట్రాఫిక్ ఎస్ఐలు సైదిరెడ్డి, ఆంజనేయులు, కౌన్సిలర్లు పాక చిరంజీవి యాదవ్, బద్రి గాలయ్య, కో-ఆప్షన్ సభ్యులు పస్తం గంగారాములు, మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాసర్ల శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి చింతల సాయిలు, నాయకులు బత్తుల దాసు, దేప రాజు, బత్తుల శ్రీశైలం, కామిశెట్టి భాస్కర్, ఊదరి యాదయ్య, సిపిఐ నాయకులు పగిళ్ల మోహన్ రెడ్డి, బిజెపి నాయకులు అన్నమోని గోవిందు, గుజ్జుల సురేందర్ రెడ్డి, కంచర్ల గోవర్ధన్ రెడ్డి, కాసుల వెంకటేశం, శ్యామ్ ప్రసాద్, చెరుకు శివకుమార్, ఉస్కాగుల శీను, జనసేన నాయకులు ప్రవీణ్, కిరాణా అసోసియేషన్ అధ్యక్షులు కామిశెట్టి వెంకటేష్, కామిశెట్టి చంద్రశేఖర్, అలిసేరు వీరాస్వామి, పోలోజు మాధవచారి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

బ్రిడ్జి నిర్మాణంతో ప్రజలు, వ్యాపారులకు ఇబ్బందులు కలగొద్దు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News