సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలోని కంగ్టి మండల కేంద్రంలో కనకదుర్గ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో భవానీ అమ్మవారి మండపం వద్ద మంగళవారం సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.గ్రామ జ్యోతిష్యులు అక్షయ్ మహారాజ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు 100 మంది మహిళలు భక్తిశ్రద్ధలతో పాల్గొని అమ్మవారికి కుంకుమార్చన చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమంతో అమ్మవారి మండపం భక్తులతో సందడిగా మారింది. మహిళలు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ప్రత్యేక పూజలతో కంగ్టి మండల కేంద్రంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
PRINT TIME: October 13, 2026 09:22 PM
భవానీ అమ్మవారి సన్నిధిలో 100 మంది మహిళల పూజలు

13-10-2026
12 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Krishna
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలోని కంగ్టి మండల కేంద్రంలో కనకదుర్గ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో భవానీ అమ్మవారి మండపం వద్ద మంగళవారం సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.గ్రామ జ్యోతిష్యులు అక్షయ్ మహారాజ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు 100 మంది మహిళలు భక్తిశ్రద్ధలతో పాల్గొని అమ్మవారికి కుంకుమార్చన చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమంతో అమ్మవారి మండపం భక్తులతో సందడిగా మారింది. మహిళలు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ప్రత్యేక పూజలతో కంగ్టి మండల కేంద్రంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి