శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం అమ్మవారు అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అన్నపూర్ణాదేవిని పూజిస్తే అన్నానికి లోటుండదని భక్తుల విశ్వాసం. రామన్నపేట పట్టణంలోని చెన్నకేశవస్వామి ఆలయం, శివాలయం, ఎంప్లాయిస్ కాలనీ, గౌండ్ల కాలనీలతోపాటు మండలంలోని కక్కిరేణి, ఎన్నారం, మునిపంపుల, ఇంద్రపాలనగరం, వెల్లంకి, సిరిపురం, లక్ష్మాపురం, తదితర గ్రామాల్లో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఎంప్లాయిస్ కాలనీలో ప్రత్యేక పూజలు
రామన్నపేట ఎంప్లాయిస్ కాలనీలో వినాయక మిత్ర మండలి అసోసియేషన్ ఆధ్వర్యంలో అమ్మవారికి కుంకుమార్చన, అభిషేకం, హోమం నిర్వహించారు. గ్రామం సుభిక్షంగా ఉండాలని, ప్రజలు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని, పంటలు సమృద్ధిగా పండాలని అమ్మవారిని వేడుకున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.
కార్యక్రమంలో అక్కెనపల్లి ప్రవీణ్‌కుమార్, బాకూరి శివ, ఒంటెద్దు రమేష్, కందుకూరు శంకర్, బత్తుల శీను, మినుముల సందీప్, రాచకొండ రాజేష్, నామానంది వినయ్, గంగాపురం గణేష్, శ్యామల ప్రవీణ్, ఒంటెద్దు బాలకృష్ణ, రేవంత్, ఉష, బడుగు లావణ్య, రఘు, మద్దెగల్ల కళ్యాణి, నరసింహ, కోట ఉమాశ్రీ, విజయ్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి