Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రతి ఇంటికీ ఇంకుడు గుంతే లక్ష్యం.. నరసింహపురం అభివృద్ధికి సర్పంచ్ వేమూరి సత్యనారాయణ వినూత్న అడుగు! దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 13, 2026 01:17 AM

సమాచార హక్కు చట్టంతో పారదర్శక పాలన: డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి

12-10-2026 3 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

కోదాడ పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో సమాచార హక్కు చట్టం–2005 అమల్లోకి వచ్చి 21 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి కేక్ కట్ చేసి మాట్లాడారు. సమాచార హక్కు చట్టం ప్రజలకు ప్రభుత్వ శాఖల నుంచి అవసరమైన సమాచారాన్ని పొందే అవకాశం కల్పిస్తుందని తెలిపారు. ఈ చట్టం ద్వారా పాలనలో పారదర్శకత పెరగడంతో పాటు అధికారుల జవాబుదారీతనం మెరుగుపడుతుందని పేర్కొన్నారు.ప్రజలు తమ హక్కులపై అవగాహన కలిగి ఉండాలని, ప్రభుత్వ శాఖల పనితీరు, ప్రజా సంక్షేమ పథకాలకు సంబంధించిన సమాచారాన్ని చట్టబద్ధంగా పొందవచ్చని వివరించారు. సమాచార హక్కు చట్టాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని, ప్రజల్లో ఈ చట్టంపై మరింత అవగాహన పెంపొందించాలని డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు గడ్డం అంజి, ప్రెస్ క్లబ్ గౌరవ సలహాదారుడు ఏనుగుల వీరాంజనేయులు, సమాచార హక్కు చట్టం 2005 కోదాడ టౌన్ ప్రెసిడెంట్ ఎస్.కె నూరుద్దీన్ ఉపాధ్యక్షులు బాణాల అబ్రహం, లింగ జగన్మోహన్రావు, చందు, రమేష్, ఎం వెంకటేశ్వర్లు, కే వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు..

Sthanikam

సమాచార హక్కు చట్టంతో పారదర్శక పాలన: డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News