Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రతి ఇంటికీ ఇంకుడు గుంతే లక్ష్యం.. నరసింహపురం అభివృద్ధికి సర్పంచ్ వేమూరి సత్యనారాయణ వినూత్న అడుగు! దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 13, 2026 02:23 AM

రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహశీల్దార్‌!

12-10-2026 23 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

అబ్దుల్లాపూర్‌మెట్‌ తహశీల్దార్‌, మండల సర్వేయర్‌ అరెస్ట్‌

అబ్దుల్లాపూర్‌మెట్‌: లేఅవుట్‌ అనుమతుల కోసం జాయింట్‌ ఇన్‌స్పెక్షన్‌ సర్వే రిపోర్టు జారీ చేసేందుకు రూ.20 లక్షల లంచం తీసుకుంటూ అబ్దుల్లాపూర్‌మెట్‌ తహశీల్దార్‌ బి. సుదర్శన్‌రెడ్డి, మండల సర్వేయర్‌ బటుక శ్రీనివాసులు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఏసీబీ, సీఐయూ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన దాడిలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

రూ.30 లక్షల నుంచి రూ.20 లక్షలకు..

లేఅవుట్‌ కోసం జాయింట్‌ ఇన్‌స్పెక్షన్‌ సర్వే రిపోర్టు ఇచ్చేందుకు తొలుత రూ.30 లక్షలు డిమాండ్‌ చేయగా, చివరకు రూ.20 లక్షలకు ఒప్పందం కుదిరినట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు. తహశీల్దార్‌ ఆదేశాల మేరకు మండల సర్వేయర్‌ లంచం సొమ్ము స్వీకరిస్తుండగా అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితుల వద్ద నుంచి రూ.20 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.

రసాయన పరీక్షల్లో పాజిటివ్‌

సర్వేయర్‌ రెండు చేతుల వేళ్లకు నిర్వహించిన రసాయన పరీక్షల్లో పాజిటివ్‌గా తేలింది. తహశీల్దార్‌, మండల సర్వేయర్‌ను అరెస్ట్‌ చేసి నాంపల్లిలోని ఏసీబీ కేసుల ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని ఏసీబీ అధికారులు తెలిపారు.

లంచం అడిగితే 1064కు ఫోన్‌ చేయండి

ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం డిమాండ్‌ చేస్తే ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్‌ 1064కు ఫిర్యాదు చేయాలని అధికారులు ప్రజలకు సూచించారు.

Sthanikam

రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహశీల్దార్‌!

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News