నారాయణఖేడ్ నియోజకవర్గంలో మనూర్ మండలం మైయికోడ్ గ్రామానికి చెందిన సీనియర్ విలేకరి దండు రాములుపై అథిమ్యాల్ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు కులం పేరుతో దూషించి దాడి చేశారని ఆయన ఆరోపించారు. మార్చి 17న పాఠశాల సమస్యలపై వార్తా సేకరణకు వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలిపారు.తనను గ్రామపంచాయతీ కార్యాలయానికి తీసుకెళ్లి అవమానించారని,తనపై జరిగిన ఘటనకు సంబంధించిన వీడియోలను సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేశారని ఆరోపించారు.ఈ ఘటనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదైనప్పటికీ, 205 రోజులైనా సంబంధిత ఉపాధ్యాయుడిపై శాఖాపరమైన చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ విషయంపై ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్, జిల్లా కలెక్టర్, జిల్లా విద్యాశాఖ అధికారులకు వినతులు సమర్పించినా న్యాయం జరగలేదన్నారు. నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఎన్. ఉమా హారతి స్పందించి ఈ ఘటనపై ప్రత్యేక విచారణ జరిపించాలని, ఆరోపణలు నిజమని తేలితే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. తనపై నమోదైన కేసుపై కూడా నిష్పక్షపాతంగా విచారణ జరిపించి, తన కుటుంబానికి న్యాయం చేయాలని దండు రాములు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.
205 రోజులుగా ఎదురుచూపులే.. తనకు న్యాయం చేయాలని విలేకరి వేడుకోలు

Krishna

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి