Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలి దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 12, 2026 03:09 PM

రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలి

12-10-2026 3 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఐజీ షాహనవాజ్ ఖాసిం.

చిట్యాల, అక్టోబర్ 12: రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టడంతో పాటు నేరాల నియంత్రణపై నిరంతరం నిఘా ఉంచాలని యాదాద్రి జోన్ ఐజీ షాహనవాజ్ ఖాసిం పోలీస్ అధికారులను ఆదేశించారు. సోమవారం నల్లగొండ జిల్లా చిట్యాల పోలీస్ స్టేషన్‌ను ఆయన తనిఖీ చేసి, కేసుల దర్యాప్తు పురోగతి, స్టేషన్ రికార్డులు, శాంతిభద్రతల పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలను సమీక్షించారు.

ఈ సందర్భంగా ఐజీ మాట్లాడుతూ జాతీయ రహదారిపై తరచూ ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి, వాటి నివారణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలపై ప్రత్యేక నిఘా పెట్టాలని ఆదేశించారు.

హెల్మెట్, సీట్‌బెల్ట్ వినియోగంపై వాహనదారులకు అవగాహన కల్పించాలని తెలిపారు.

మహిళలు, బాలల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని, పోక్సో కేసుల్లో వేగవంతమైన, నాణ్యమైన దర్యాప్తు చేపట్టాలని సూచించారు. దొంగతనాల నివారణకు రాత్రి పెట్రోలింగ్‌ను ముమ్మరం చేయడంతో పాటు సీసీ కెమెరాల వినియోగాన్ని పెంచాలని, పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించి నేరస్తులకు శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా వ్యవహరిస్తూ, వారి సమస్యలను చట్టప్రకారం పరిష్కరించాలని తెలిపారు.

జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ ఐజీ సూచనల మేరకు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ పెంచి, ప్రజల భద్రతకు అవసరమైన చర్యలు చేపడతామని పేర్కొన్నారు. ఈ తనిఖీలో నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి, చిట్యాల సీఐ సురేష్, ఎస్‌ఐ వెంకట్ రెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News