సంగారెడ్డి పట్టణంలోని అన్ని వార్డులను సమానంగా అభివృద్ధి చేయడమే లక్ష్యమని ఎమ్మెల్యే చింత ప్రభాకర్ అన్నారు. పట్టణంలోని 37వ వార్డులో కౌన్సిలర్ జలేందర్ ఆధ్వర్యంలో చేపట్టనున్న భూగర్భ డ్రైనేజీ పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రజలకు అవసరమైన డ్రైనేజీ, రహదారులు, తాగునీరు వంటి మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలని,అభివృద్ధి పనులను నాణ్యతతో త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సంగారెడ్డి పట్టణ అభివృద్ధికి రూ.50 కోట్ల నిధులు మంజూరు కాగా, రూ.22 కోట్ల పనులు మాత్రమే పూర్తయ్యాయని, మిగిలిన నిధులను కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసిందని విమర్శించారు.పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులు పూర్తి చేసేందుకు మిగిలిన నిధులను తిరిగి మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ కూన వనిత,కాసాల బుచ్చిరెడ్డి,నాగరాజు గౌడ్, పల్లె సంజీవరావు, కౌన్సిలర్లు కొత్తపల్లి శ్రీకాంత్, దశరథ్ రెడ్డి, జాఫర్, సురేష్, నాయికోటి నవీన్, శ్రీకాంత్, వార్డు సభ్యుడు జీవీ వసంత్ తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధి నిరంతర ప్రక్రియ.. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం

Krishna

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి