నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండలం బోరంచ గ్రామ శివారులో మంజీరా నది ఒడ్డున వెలసిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ నల్లపోచమ్మ అమ్మవారి ఆలయంలో శ్రీదేవి శరన్నవరాత్రి దసరా మహోత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం అమ్మవారిని శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అలంకరణలో అందంగా అలంకరించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు సిద్ధు స్వామి, నాగేశ్ స్వామి అమ్మవారికి పంచామృతాలు, గంగాజలంతో అభిషేకం నిర్వహించి, ప్రత్యేక కుంకుమార్చన పూజలు చేశారు. అమ్మవారి దర్శనం కోసం భక్తులు ఆలయానికి తరలివచ్చి ప్రత్యేక పూజల్లో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారి కృపతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని భక్తులు ప్రార్థించారు.
PRINT TIME: October 11, 2026 08:45 AM
శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అలంకరణలో దర్శనమిచ్చిన నల్లపోచమ్మ అమ్మవారు

11-10-2026
28 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Krishna
నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండలం బోరంచ గ్రామ శివారులో మంజీరా నది ఒడ్డున వెలసిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ నల్లపోచమ్మ అమ్మవారి ఆలయంలో శ్రీదేవి శరన్నవరాత్రి దసరా మహోత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం అమ్మవారిని శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అలంకరణలో అందంగా అలంకరించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు సిద్ధు స్వామి, నాగేశ్ స్వామి అమ్మవారికి పంచామృతాలు, గంగాజలంతో అభిషేకం నిర్వహించి, ప్రత్యేక కుంకుమార్చన పూజలు చేశారు. అమ్మవారి దర్శనం కోసం భక్తులు ఆలయానికి తరలివచ్చి ప్రత్యేక పూజల్లో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారి కృపతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని భక్తులు ప్రార్థించారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి