కొత్తపేట; అక్టోబర్,10 (స్థానికం)
జైశ్రీరామ్ సేవా సమితి అధ్యక్షులు ఠాగూర్ ఉపేందర్ సింగ్ చౌహన్ ఆధ్వర్యంలో కొత్తపేటలోని మోహన్ నగర్ లో శనివారం నాడు అమావాస్య అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కొత్తపేట డివిజన్ మాజీ కార్పొరేటర్ నాయికోటి పవన్ కుమార్ హాజరై భక్తులకు అన్నప్రసాదాన్ని వితరణ చేశారు. నాయకోటి పవన్ కుమార్ మాట్లాడుతూ.. అమావాస్య సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు. ఆధ్యాత్మికతతో పాటు సేవా కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా సమాజంలో సేవాభావాన్ని పెంపొందించవచ్చని తెలిపారు. జైశ్రీరామ్ సేవా సమితి ఆధ్వర్యంలో గత మూడు సంవత్సరాలుగా కొనసాగుతున్న అన్నదాన కార్యక్రమం ఎంతో మందికి ఉపయోగకరంగా ఉంటోందన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలను నిరంతరం కొనసాగించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఠాగూర్ ఉపేందర్ సింగ్ చౌహన్ మాట్లాడుతూ.. గత మూడు సంవత్సరాలుగా అమావాస్య సందర్భంగా మోహన్ నగర్ లో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. అమావాస్య రోజున అన్నదానం చేయడం ఎంతో పుణ్యప్రదమని పెద్దలు చెప్పిన మాటలను ఆచరిస్తూ ప్రతి నెలా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో సుమారు 500 మందికి పైగా పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించినట్లు తెలిపారు.భవిష్యత్తులోనూ ప్రతి అమావాస్య రోజున అన్నదాన కార్యక్రమాన్ని కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సోషల్ మీడియా ఇంచార్జ్ సంగ్రం, వైస్ ప్రెసిడెంట్ సాయి, సెక్రటరీ రింకు గౌర్, భాను ప్రకాష్, వీరేష్, తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి