సంప్రదాయబద్ధంగా వేడుకల్లో పాల్గొన్న మహిళలు.
వెలిమినేడు: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ ఉత్సవాల్లో భాగంగా వెలిమినేడు గ్రామంలో శనివారం ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రామపంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో మహిళలు ఉత్సాహంగా పాల్గొని బతుకమ్మలను పేర్చి, ఆటపాటలతో సందడి చేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చంద్రారెడ్డి, ఉపసర్పంచ్ అంతటి స్వప్న సత్తయ్య గౌడ్, వార్డు సభ్యుడు నోముల రామకుమార్, పంచాయతీ కార్యదర్శి తాటికొండ లింగస్వామి, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు అంతటి పారిజాత నరసింహ, మాజీ సర్పంచ్ దేశభైన మల్లమ్మ, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు అంశాల సత్యనారాయణ, మాజీ సింగిల్ విండో వైస్ చైర్మన్ వీరేశం, కాంగ్రెస్ గ్రామ శాఖ ప్రధాన కార్యదర్శి కర్దూరి అంజిరెడ్డి, సహాయ కార్యదర్శి గోలి నరేష్, ఉపాధ్యక్షుడు తాటికొండ సత్యనారాయణ, మాజీ వార్డు సభ్యురాలు అంతటి శోభా రాజు, బీఆర్‌ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు ఆరూరి శ్రీశైలం, బీజేపీ నాయకుడు వెల్ది రాఘవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి