హయత్‌నగర్, అక్టోబర్ 10
కుంట్లూరులోని శ్రీ వినాయక నగర్ కాలనీలో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకుని మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, సంప్రదాయ దుస్తుల్లో ఆటపాటలతో సందడి చేశారు. చిన్నారులు, కాలనీవాసుల ఉత్సాహంతో కాలనీలో పండుగ వాతావరణం నెలకొంది.
మహిళల ఐక్యతకు ప్రతీక బతుకమ్మ బతుకమ్మ వేడుకలు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించడంతో పాటు మహిళల్లో ఐక్యతను, కాలనీవాసుల మధ్య ఆత్మీయతను పెంపొందిస్తాయని స్థానికులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు డీ. లింగం, ఉపాధ్యక్షులు భీంరాజ్, కనకరావు, లక్ష్మీనారాయణ, దుర్గాప్రసాద్, వేణుగోపాల్, లక్ష్మారెడ్డి, మల్లారెడ్డి, భద్రాచలం, రామ్‌చరణ్, రమేష్, నరేష్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి