Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మాల నిరుద్యోగులు, విద్యార్థుల ఆవేదన.. హక్కుల కోసం పోరాటానికి పిలుపు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 07:48 PM

మాల నిరుద్యోగులు, విద్యార్థుల ఆవేదన.. హక్కుల కోసం పోరాటానికి పిలుపు

10-10-2026 76 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ పట్టణంలోని కార్తికేయ హోటల్‌లో మాల మహానాడు జేఏసీ, మాల కోఆర్డినేషన్ ఫోరం ఆధ్వర్యంలో మాల నిరుద్యోగులు, విద్యార్థులు, ఉద్యోగస్తులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాల జేఏసీ, మాల కోఆర్డినేషన్ ఫోరం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు శకుంతల మాట్లాడుతూ, ఎస్సీ వర్గీకరణ అమలుతో మాలలకు ఉద్యోగ రిజర్వేషన్ల విషయంలో తీవ్ర నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. మాలలకు జరిగిన అన్యాయాన్ని ప్రతి గ్రామంలోని ప్రజలకు వివరించి, హక్కుల పరిరక్షణ కోసం అందరూ ఐక్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.సమావేశంలో పాల్గొన్న విద్యార్థులు, నిరుద్యోగులు మాట్లాడుతూ, మాలల సమస్యలపై ప్రజాప్రతినిధులు స్పందించాలని, తమ వర్గానికి న్యాయం జరిగేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. మాలలకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించని ప్రజాప్రతినిధులను రానున్న ఎన్నికల్లో ప్రజాస్వామ్య పద్ధతిలో నిలదీస్తామని పేర్కొన్నారు.త్వరలో నారాయణఖేడ్ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో మాల జేఏసీ, మాల కోఆర్డినేషన్ ఫోరం ఆధ్వర్యంలో సమావేశాలు నిర్వహించి, ఎస్సీ వర్గీకరణ అంశంపై మాలల్లో అవగాహన కల్పిస్తామని తెలిపారు. మాల సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు, రాజకీయ నాయకులు, ఉద్యోగులు, విద్యార్థులు, నిరుద్యోగులు కలిసికట్టుగా ఉండి తమ హక్కుల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు మల్లేశం, ఉపాధ్యక్షుడు దేవరాజు, విశ్రాంత ప్రిన్సిపాల్ అనంతయ్య, ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు లక్ష్మణ్, ఎంసీఎఫ్ రాష్ట్ర కమిటీ సభ్యుడు దేవయ్య, సీనియర్ నాయకుడు కమలాపురం మారుతి, యువ నాయకులు గైని సాయిలు, సంజయ్ కుమార్, కె. నరసింహులు, గణపతి, ఎం. నర్సింలు, విజయకుమార్, తిరుపతి, భీమ్‌సేన భాను, రాజు, లక్ష్మయ్య, మోహన్ రాజు, అనుముల తుకారం, జమ్మికుంట కళాబృందం సభ్యులు, పలువురు మాల సంఘాల నాయకులు, విద్యార్థులు, నిరుద్యోగులు పాల్గొన్నారు.

Sthanikam

మాల నిరుద్యోగులు, విద్యార్థుల ఆవేదన.. హక్కుల కోసం పోరాటానికి పిలుపు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News