Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మాల నిరుద్యోగులు, విద్యార్థుల ఆవేదన.. హక్కుల కోసం పోరాటానికి పిలుపు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:52 PM

ఢిల్లీలో సీపీఎం నేతల అరెస్టు దుర్మార్గం: చౌటుప్పల్‌లో నేతల నిరసన

10-10-2026 10 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

​హైవేపై బైఠాయించిన సీపీఎం శ్రేణులు

సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్

న్యూఢిల్లీలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న సీపీఎం జాతీయ నాయకులు, ప్రజాసంఘాల ప్రతినిధులను అక్రమంగా అరెస్టు చేయడాన్ని సీపీఎం చౌటుప్పల్ కమిటీ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు శనివారం చౌటుప్పల్‌లో జాతీయ రహదారిపై సీపీఎం శ్రేణులు బైఠాయించి కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నిరసన తెలిపాయి.​ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బూరుగు కృష్ణారెడ్డి, ఎండీ పాషా, గోశిక కరుణాకర్, గంగాదేవి సైదులు మాట్లాడుతూ.. ఓటర్లను ఓటు హక్కుకు దూరం చేసే విధంగా తీసుకొచ్చిన ఎస్ఐఆర్ ప్రక్రియను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో శాంతియుత నిరసనలు జరిగాయని తెలిపారు.​ప్రజా నిరసనలకు భయపడిన నరేంద్ర మోదీ ప్రభుత్వం ఢిల్లీ వ్యాప్తంగా వర్చువల్ కర్ఫ్యూ విధించడం, ఇంటర్నెట్ నిలిపివేత, మెట్రో స్టేషన్ల మూసివేత వంటి అణచివేత చర్యలకు పాల్పడిందని విమర్శించారు. జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తున్న సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ఎం.ఏ. బేబీ, కేరళ మాజీ సీఎం పినరయి విజయన్, త్రిపుర మాజీ సీఎం మాణిక్ సర్కార్, బృందా కారత్, బీవీ రాఘవులు సహా పలువురు ఎంపీలను అక్రమంగా అరెస్టు చేయడం అప్రజాస్వామికమని మండిపడ్డారు. ​అరెస్టు చేసిన నాయకులు, నిరసనకారులను వెంటనే విడుదల చేయాలి.​సీఈసీ జ్ఞానేశ్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలి, బర్తరఫ్ చేయాలి. ​ఎస్ఐఆర్ ప్రక్రియను నిలిపివేసి, తొలగించిన ఓట్లను తిరిగి పునరుద్ధరించాలి.​ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలపై దేశవ్యాప్తంగా పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని నాయకులు హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో బండారు నరసింహ, బత్తుల దాసు, గోపగోని లక్ష్మణ్, యాట బాలరాజు, సప్పిడి రాఘవరెడ్డి, ఇట్టబోయన శేఖర్, సప్పిడి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఢిల్లీలో సీపీఎం నేతల అరెస్టు దుర్మార్గం: చౌటుప్పల్‌లో నేతల నిరసన

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News