సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పట్టణంలో సమాజసేవకుడు, సాయి లక్ష్మి డాక్యుమెంట్ రైటర్ చైర్మన్ సాయిరాం గుప్తా తన మిత్రబృందంతో కలిసి ప్రతి నెల అమావాస్య రోజున ఎమ్మార్వో కార్యాలయ ఆవరణలో వందలాది మంది పేదలకు, బాటసారులకు ఉచితంగా అన్నప్రసాదం పంపిణీ చేస్తున్నారు. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడమే నిజమైన మానవసేవ అనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారు.పితృపక్షాల పెద్దల అమావాస్య సందర్భంగా కూడా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సేవా కార్యక్రమానికి సహకరిస్తున్న గురువులు గూడెం మహిపాల్ రెడ్డి,మధుసూదన్ రెడ్డి, మిత్రుడు గూడెం విక్రమ్ రెడ్డికి సాయిరాం గుప్తా తన మిత్రబృందం తరఫున కృతజ్ఞతలు తెలిపారు.సాయిబాబా ఆశీస్సులతో, మిత్రుల సహకారంతో అన్నదాన కార్యక్రమాన్ని కొనసాగించడం ఎంతో సంతృప్తినిస్తోందని మిత్రబృందం పేర్కొంది.పేదలు,బాటసారుల ఆకలి తీర్చడమే తమ ప్రధాన లక్ష్యమని,భవిష్యత్తులోనూ ఈ సేవా కార్యక్రమాన్ని కొనసాగిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో నాగరాజు గాంధీ,జగదీశ్వర్ రెడ్డి, సతీష్ రెడ్డి, శివారెడ్డి, ఎంజాల శ్రీను, చిన్న ముదిరాజ్, గణేష్ గౌడ్, రమేష్, చంద్రయ్య, స్నేహతో పాటు పలువురు స్థానిక ప్రముఖులు, ప్రజలు పాల్గొన్నారు.
అన్నదానమే మహాదానం.. పేదల ఆకలి తీరుస్తున్న సాయిరాం గుప్తా

Krishna

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి