Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 01:23 PM

విద్యుత్ ఛార్జీలు పెంచితే ఉద్యమం సీపీఎం మండల కార్యదర్శి నాంపల్లి చంద్రమౌళి.

10-10-2026 10 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నాంపల్లి, అక్టోబర్ 10: ట్రూ అప్‌ ఛార్జీల పేరుతో ప్రజలపై రూ.5,420 కోట్ల విద్యుత్‌ భారాన్ని మోపే ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని సీపీఎం మండల కార్యదర్శి నాంపల్లి చంద్రమౌళి డిమాండ్‌ చేశారు. శుక్రవారం పస్నూరు గ్రామంలో నిర్వహించిన రైతు సంఘం ప్రచార కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

ఇప్పటికే ధరల పెరుగుదల, కరువు పరిస్థితులతో ఇబ్బందులు పడుతున్న ప్రజలపై అదనపు విద్యుత్‌ భారం మోపడం సరికాదన్నారు. ప్రభుత్వ శాఖల నుంచి రావాల్సిన రూ.57,336 కోట్ల విద్యుత్‌ బకాయిలను వసూలు చేయకుండా ప్రజలపై భారం వేస్తే రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్‌ ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.

విద్యుత్‌ కోతలు, లో-వోల్టేజీ సమస్యలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, మోటార్లు కాలిపోయి నష్టపోతున్నారని తెలిపారు. రైతులకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేసి పంటలను కాపాడాలని కోరారు.

నవంబర్‌ 15 నుంచి 18 వరకు నల్లగొండలో జరిగే అఖిల భారత రైతు సంఘం 36వ జాతీయ మహాసభలను, 15న నిర్వహించే బహిరంగ సభను విజయవంతం చేయాలని రైతులు, ప్రజలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు దానపాక ముత్తిలింగం, ఆకారపు కాశయ్య, రెడ్డిమల్ల గోవింద్‌ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

విద్యుత్ ఛార్జీలు పెంచితే ఉద్యమం సీపీఎం మండల కార్యదర్శి నాంపల్లి చంద్రమౌళి.

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News