Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మాల నిరుద్యోగులు, విద్యార్థుల ఆవేదన.. హక్కుల కోసం పోరాటానికి పిలుపు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:53 PM

క్రమశిక్షణ, మానసిక ఉల్లాసానికి క్రీడలు దోహదం చేస్తాయి...

10-10-2026 11 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District Bureau Nalagonda
NM Yadav

5వ పోలీస్‌ స్పోర్ట్స్‌ జోనల్‌ స్థాయి ఎంపికలు ప్రారంభం

పోలీస్‌ క్రీడాకారులను ఉత్సాహపరిచిన ఎస్పీ శరత్‌ చంద్ర పవార్‌

​నల్లగొండ : విధి నిర్వహణలో నిరంతరం బిజీగా ఉండే పోలీస్‌ సిబ్బందిలో శారీరక దృఢత్వం, క్రమశిక్షణ, మానసిక ఉల్లాసం పెంపొందేందుకు క్రీడలు ఎంతగానో దోహదపడతాయని నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్‌ చంద్ర పవార్‌ అన్నారు. 5వ తెలంగాణ పోలీస్‌ స్పోర్ట్స్‌ అండ్‌ గేమ్స్‌ మీట్‌–2026లో పాల్గొనే క్రీడాకారుల ఎంపిక కోసం శనివారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో నిర్వహించిన ‘యాదాద్రి-V’ జోనల్‌ స్థాయి క్రీడా ఎంపికల పోటీలను ఆయన ప్రారంభించారు.

​ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పోలీస్‌ సిబ్బందిలో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసి రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ చాటేలా తీర్చిదిద్దడమే ఈ జోనల్‌ స్థాయి ఎంపికల ముఖ్య ఉద్దేశమని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే 5వ పోలీస్‌ స్పోర్ట్స్‌ మీట్‌లో భాగంగా క్లస్టర్‌-D పోటీలు నవంబరు 3 నుంచి 5వ తేదీ వరకు వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో, క్లస్టర్‌-E పోటీలు నవంబరు 25 నుంచి 28 వరకు నిజామాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో జరుగుతాయని వెల్లడించారు. వీటిలో పురుషులు, మహిళలకు వేర్వేరుగా వివిధ క్రీడాంశాల్లో పోటీలు ఉంటాయని పేర్కొన్నారు.

​జోనల్‌ ఎంపికల్లో ప్రతిభ, శారీరక సామర్థ్యం, ప్రదర్శన ఆధారంగా ఎంపికయ్యే క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీల్లో మెరుగైన ఫలితాలు సాధించి పోలీస్‌ శాఖకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

క్రీడల్లో పాల్గొనడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుందని, జట్టుగా పనిచేసే తత్వం అలవడుతుందని చెప్పారు. క్రీడాకారులకు పోలీస్‌ శాఖ తరఫున పూర్తి ప్రోత్సాహం ఉంటుందన్నారు.

​కార్యక్రమంలో అదనపు ఎస్పీ రమేష్‌, డీఎస్పీ శ్రీనివాసరావు, ఆర్‌ఐలు సంతోష్‌, హరిబాబు, శ్రీనుతో పాటు పలువురు పోలీస్‌ అధికారులు, క్రీడాకారులు పాల్గొన్నారు

Sthanikam

క్రమశిక్షణ, మానసిక ఉల్లాసానికి క్రీడలు దోహదం చేస్తాయి...

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News