సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్‌కు TUWJ–IJU జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరి ఆధ్వర్యంలో జర్నలిస్టులు శనివారం క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్‌కు పుస్తకాలు, పెన్నులు అందజేసి, ఆయన ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని ఆకాంక్షించారు.జిల్లాలో ప్రజాపాలన మరింత మెరుగ్గా కొనసాగాలని, పేదలు, బడుగు బలహీన వర్గాల సమస్యలను పరిష్కరించి వారికి అండగా నిలవాలని బండారు యాదగిరి కోరారు.అదేవిధంగా జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు మతిన్, సీనియర్ జర్నలిస్టు మసూద్, జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి విల్సన్, చిన్న, మధ్యతరహా పత్రికల సంఘం జిల్లా అధ్యక్షుడు సిద్ధిక్ అహ్మద్, ప్రధాన కార్యదర్శి ఈశ్వర్ చవాన్, కోశాధికారి లక్ష్మణ్, ఫోటో జర్నలిస్టుల సంఘం అధ్యక్షుడు ఆరిఫ్, జర్నలిస్టులు సూర్య వెంకట్, దినేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ ప్రతీక్ జైన్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన TUWJ జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరి

Krishna
సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్‌కు TUWJ–IJU జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరి ఆధ్వర్యంలో జర్నలిస్టులు శనివారం క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్‌కు పుస్తకాలు, పెన్నులు అందజేసి, ఆయన ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని ఆకాంక్షించారు.జిల్లాలో ప్రజాపాలన మరింత మెరుగ్గా కొనసాగాలని, పేదలు, బడుగు బలహీన వర్గాల సమస్యలను పరిష్కరించి వారికి అండగా నిలవాలని బండారు యాదగిరి కోరారు.అదేవిధంగా జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు మతిన్, సీనియర్ జర్నలిస్టు మసూద్, జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి విల్సన్, చిన్న, మధ్యతరహా పత్రికల సంఘం జిల్లా అధ్యక్షుడు సిద్ధిక్ అహ్మద్, ప్రధాన కార్యదర్శి ఈశ్వర్ చవాన్, కోశాధికారి లక్ష్మణ్, ఫోటో జర్నలిస్టుల సంఘం అధ్యక్షుడు ఆరిఫ్, జర్నలిస్టులు సూర్య వెంకట్, దినేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి