Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మాల నిరుద్యోగులు, విద్యార్థుల ఆవేదన.. హక్కుల కోసం పోరాటానికి పిలుపు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:56 PM

కల్హేర్‌లో రైతుల కోసం బీఆర్‌ఎస్ పాదయాత్ర.. భారీ ధర్నా

10-10-2026 41 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

రోడ్లు, నల్లవాగు నీరు, విద్యుత్ సమస్యలను పరిష్కరించాలి: మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి

సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలంలో నెలకొన్న రోడ్ల దుస్థితి, నల్లవాగు నీటి సమస్య, రైతులకు ఎదురవుతున్న విద్యుత్ ఇబ్బందులను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. మాసాన్‌పల్లి ఎక్స్‌ రోడ్డు నుంచి కల్హేర్ మండల కేంద్రం వరకు పాదయాత్ర నిర్వహించి, అనంతరం భారీ ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ప్రశ్నిస్తూ నినాదాలు చేశారు. అనంతరం విద్యుత్ సబ్‌స్టేషన్‌ను సందర్శించి, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై విద్యుత్ అధికారులతో చర్చించారు.ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి మాట్లాడుతూ.. కల్హేర్ మండల ఏర్పాటు నుంచి అభివృద్ధి పనుల వరకు తమ కుటుంబం, బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఎంతో కృషి చేశాయని తెలిపారు. తన తండ్రి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో మండల ఏర్పాటు సహా పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారని, తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనూ రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధికి కృషి చేశానని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు మూడు సంవత్సరాలు కావస్తున్నా కల్హేర్ మండలంలో చేసిన ముఖ్యమైన అభివృద్ధి పనులేమిటో ప్రజలకు వివరించాలని, గతంలో మంజూరు చేసిన రోడ్ల పనులను పూర్తి చేయకుండా ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రశ్నించారు.రోడ్లపై గుంతల కారణంగా ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని, పెండింగ్‌లో ఉన్న పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.అదేవిధంగా నల్లవాగు నీటిని కల్హేర్ కాముని చెరువు వరకు అందించేందుకు గతంలో చర్యలు తీసుకున్నామని, ప్రస్తుతం సాగునీటి సరఫరా సక్రమంగా లేక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సాగునీరు అందక పంటలు ఎండిపోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయని, నల్లవాగు నీటిని చెరువులకు చేర్చి రైతుల పంటలను కాపాడాలని ప్రభుత్వాన్ని కోరారు. వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ అందించడంతో పాటు, విద్యుత్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను కోరారు. రైతులు తమ సమస్యల కోసం కార్యాలయాల చుట్టూ తిరగకుండా అధికారులు క్షేత్రస్థాయిలో స్పందించి పరిష్కారం చూపాలని సూచించారు.కల్హేర్ మండలంలో రోడ్లు, సాగునీరు, విద్యుత్ సమస్యలను పరిష్కరించడం ప్రభుత్వ బాధ్యత అని భూపాల్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజలకు మెరుగైన సదుపాయాలు కల్పించి, రైతుల సమస్యలను పరిష్కరించే వరకు బీఆర్‌ఎస్ పార్టీ ప్రజల పక్షాన పోరాటం కొనసాగిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు, సర్పంచులు, ఉపసర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, పీఏసీఎస్ చైర్మన్లు, గ్రామ పార్టీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, యువకులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా, రైతుల పక్షాన కల్హేర్‌లో పాదయాత్ర, ధర్నా నిర్వహించినట్లు బీఆర్‌ఎస్ శ్రేణులు తెలిపారు.

Sthanikam

కల్హేర్‌లో రైతుల కోసం బీఆర్‌ఎస్ పాదయాత్ర.. భారీ ధర్నా

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News