Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
సేవలు ప్రశంసనీయం.. పదవీ విరమణ సిబ్బందికి ఎస్పీ వీడ్కోలు నకిలీ ఎస్టీ సర్టిఫికెట్ కలకలం: రిటైర్డ్ ఐపీఎస్ రఘువీర్ సింగ్ మీనాపై ఎఫ్‌ఐఆర్ నమోదు! మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 30, 2026 10:23 PM

మల్కాపురం గుట్టల్లో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

30-09-2026 149 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

కుళ్లిపోయిన స్థితిలో సుమారు 50-60 ఏళ్ల వృద్ధుడి శవం

ఆచూకీ తెలిస్తే సమాచారం ఇవ్వాలని చౌటుప్పల్ ఇన్ స్పెక్టర్ విజ్ఞప్తి

చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్కాపురం ఆర్‌టీవో కార్యాలయం పక్కన ఉన్న గుట్టల ప్రాంతంలో గుర్తుతెలియని ఒక వ్యక్తి (సుమారు 50 నుండి 60 సంవత్సరాల వయస్సు) మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు.బుధవారం గుట్టల వైపు వెళ్లిన స్థానికులు మృతదేహాన్ని గమనించి చౌటుప్పల్ పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. శవం పూర్తిగా డీకంపోజ్ (కుళ్లిపోయిన) స్థితిలో ఉన్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సదరు వ్యక్తి మృతికి గల కారణాలు, అతని వివరాలను తెలుసుకునేందుకు దర్యాప్తు తీవ్రతరం చేశామని చౌటుప్పల్ ఇన్‌స్పెక్టర్ జి. మన్మధ కుమార్ తెలిపారు. ఈ వ్యక్తి ఆచూకీ, గుర్తింపు లేదా ఏదైనా సమాచారం తెలిసిన వారు వెంటనే చౌటుప్పల్ పోలీస్ స్టేషన్‌లోగానీ, పోలీసు అధికారులనుగానీ సంప్రదించాలని ఆయన కోరారు.

Sthanikam

మల్కాపురం గుట్టల్లో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News