చిన్నకాపర్తి: అకాల మరణంతో కుటుంబాన్ని విషాదంలో ముంచిన రూపాని హరీష్ కుటుంబానికి చిన్నకాపర్తి గ్రామ సర్పంచ్ ఆవుల సుందరయ్య యాదవ్ అండగా నిలిచారు. గ్రామానికి చెందిన రూపాని యాదగిరి కుమారుడు హరీష్ ఇటీవల మృతి చెందడంతో బాధిత కుటుంబాన్ని సర్పంచ్ పరామర్శించి సానుభూతి తెలిపారు. అనంతరం తనవంతు సాయంగా రూ.5 వేల ఆర్థిక సహాయాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. నిరుపేద కుటుంబాల కష్టసుఖాల్లో గ్రామం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. హరీష్ మృతి కుటుంబానికి తీరని లోటని, బాధిత కుటుంబానికి గ్రామస్థులంతా అండగా నిలవాలని కోరారు.
కార్యక్రమంలో వార్డు సభ్యుడు దేశాపాక మధుతో పాటు నాయకులు మేట్టు వెంకటేశం, వలిగొండ సత్యనారాయణ, పల్లపు ప్రశాంత్, పొలిమేర దశరథ, పొలిమేర పరమేష్, అన్నెపు కార్తీక్, ఎడ్ల మల్లయ్య, రూపాని నర్సింహా, రూపాని దుర్గయ్య, కాలనీ పెద్దలు, గ్రామస్థులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి