తుంగతుర్తి మండలం గొట్టిపర్తి గ్రామానికి చెందిన
కాంగ్రెస్ ,బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఆ పార్టీకి రాజీనామా చేసి శుక్రవారం గ్రామ శాఖ అధ్యక్షుడు నాలీ సైదులు ఆధ్వర్యంలో బిజెపి పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారిని జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షులు సాంకృనాయక్ , కిషన్ మోర్చా జిల్లా కోశాధికారి చందసాగర్ వారికిబిజెపి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించి మాట్లాడారు. నరేంద్ర మోడీ చేస్తున్న సంక్షేమ పథకాలను అభివృద్ధిని చూసి భారతీయ జనతా పార్టీలోకి చేరుతున్నారని అన్నారు. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి పార్టీ అభ్యర్థులు గెలుస్తారని దిమా వ్యక్తం చేశారు.చేరిన వారిలోకుక్కల ఎల్లయ్య, నలబాల వీరన్న, కోటగిరి రవి, పాల శీను, సోమయ్య, కంజట్ల రాజా రావు ,అన్నేబోయిన యాకన్న, అన్యబోయిన యాకన్న, అన్యబోయిన వెంకన్న, రమేష్ ,కోట స్వామి ,బోగోజు సోమన్న, తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి