రామంతపూర్: భరత్‌నగర్‌లోని సెయింట్ జోన్స్ హైస్కూల్‌లో హంస రూపంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వైస్ ప్రిన్సిపల్ సూరం మమతారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో ఉపాధ్యాయినులు, విద్యార్థినులు ఉత్సాహంగా పాల్గొని కోలాటాలు, ఆటపాటలతో సందడి చేశారు.
ఈ సందర్భంగా మమతారెడ్డి మాట్లాడుతూ.. బతుకమ్మ తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా, ఆడపడుచుల ఆత్మగౌరవానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుందని అన్నారు. భావితరాల విద్యార్థులకు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ప్రతి ఏడాది పాఠశాలలో బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థినులు సైతం వేడుకల్లో పాల్గొని ఆటపాటలతో అలరించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి