Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జై శ్రీరామ్ సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 10:09 PM

ప్రజా సమస్యలపై పోరాట కార్యాచరణకు ఎంసీపీఐ(యు) రాష్ట్ర కమిటీ సమావేశాలు

10-10-2026 2 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

అక్టోబర్‌ 11, 12 తేదీల్లో హైదరాబాద్‌లో భేటీ

సమావేశాలను జయప్రదం చేయండి: వరికుప్పల వెంకన్న. భారత మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ ఐక్య (ఎంసీపీఐ(యు)) తెలంగాణ రాష్ట్ర కమిటీ సమావేశాలు అక్టోబర్‌ 11, 12 తేదీల్లో హైదరాబాద్‌లోని ఓంకార్‌ భవన్‌, బి.ఎన్‌.రెడ్డి హాలులో నిర్వహించనున్నట్లు పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు వరికుప్పల వెంకన్న తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని విమర్శించారు. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలు నిర్వహించేందుకు సమావేశాల్లో భవిష్యత్తు కార్యాచరణను రూపొందించనున్నట్లు వెల్లడించారు.

ఈ సమావేశాలకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్‌ మద్దికాయల అశోక్‌ ఓంకార్‌, తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామ్రేడ్‌ గాదగోని రవి ముఖ్య అతిథులుగా హాజరుకానున్నట్లు వెంకన్న తెలిపారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, రాష్ట్ర కమిటీ సభ్యులు, వివిధ జిల్లాల కార్యదర్శులు సమావేశాల్లో పాల్గొననున్నారని పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రజల సమస్యలపై భవిష్యత్తు పోరాటాలకు దిశానిర్దేశం చేసే ఈ సమావేశాలను జయప్రదం చేయాలని వరికుప్పల వెంకన్న పిలుపునిచ్చారు.

Sthanikam

ప్రజా సమస్యలపై పోరాట కార్యాచరణకు ఎంసీపీఐ(యు) రాష్ట్ర కమిటీ సమావేశాలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News