చౌటుప్పల్ స్థానికం ప్రతినిధి:
ముందు వెళ్తున్న వాహనాన్ని కారు అతివేగంతో వెనుక నుంచి ఢీకొట్టిన ఘటనలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ ప్రమాదం శనివారం తెల్లవారుజామున చౌటుప్పల్ మండలం తూప్రాన్‌పేట గ్రామ పరిధిలోని 65వ నంబరు జాతీయ రహదారి ఫ్లైఓవర్ వద్ద చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. ధర్మోజిగూడెం గ్రామానికి చెందిన పిసాటి వినయ్ రెడ్డి (దామోదర్ రెడ్డి కుమారుడు) తన స్నేహితులు కొంత సాత్విక్ రెడ్డి, పంతం సుఖేందర్‌లతో కలిసి శుక్రవారం రాత్రి 11.30 గంటల సమయంలో కారులో హైదరాబాద్‌కు బయలుదేరారు. శనివారం తెల్లవారుజామున 1.15 గంటల ప్రాంతంలో తూప్రాన్‌పేట ఫ్లైఓవర్ వద్దకు చేరుకోగానే, కారు నడుపుతున్న సాత్విక్ రెడ్డి అతివేగం, అజాగ్రత్త కారణంగా ముందు వెళ్తున్న టాటా ఇంట్రా వాహనాన్ని వెనుక నుంచి బలంగా ఢీకొట్టాడు.ఈ ప్రమాదంలో డ్రైవర్ పక్క సీటులో కూర్చున్న పిసాటి వినయ్ రెడ్డికి తల, శరీర భాగాలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. కారు నడుపుతున్న సాత్విక్ రెడ్డితో పాటు వెనుక సీటులో ఉన్న పంతం సుఖేందర్ గాయపడ్డారు. క్షతగాత్రులను 108 అంబులెన్స్‌లో హయత్‌నగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కారు డ్రైవర్ సాత్విక్ రెడ్డిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి