Sthanikam - Truth Matters
Logo

పెద్దపేగుతో కొత్త ఆహార మార్గం.. యువతికి అరుదైన శస్త్రచికిత్స

Updated : 28 Nov 2026 20:00 IST
As Preferred Source 1 min read
పెద్దపేగుతో కొత్త ఆహార మార్గం.. యువతికి అరుదైన శస్త్రచికిత్స

మళ్లీ నోటితో ఆహారం తీసుకునేలా చేసిన యశోదా వైద్యులు..

నల్లగొండ: యాసిడ్ మింగడంతో అన్నవాహిక, జీర్ణాశయం దెబ్బతిని ఆహారం మింగలేని స్థితికి చేరుకున్న నల్లగొండ జిల్లాకు చెందిన 24 ఏళ్ల యువతికి హైదరాబాద్‌ మలక్‌పేట్‌ యశోదా సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి వైద్యులు అరుదైన శస్త్రచికిత్స నిర్వహించారు. సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ నిపుణులు డాక్టర్ లలిత్ కుమార్ రెడ్డి కంతాల ఆధ్వర్యంలోని వైద్య బృందం పెద్దపేగులో కొంత భాగాన్ని ఉపయోగించి కొత్త ఆహార మార్గాన్ని ఏర్పాటు చేసింది.

శస్త్రచికిత్స అనంతరం యువతి వేగంగా కోలుకుని మూడో రోజు నుంచే ద్రవాహారం, ఎనిమిదో రోజు నుంచి సాధారణ ఆహారం తీసుకునే స్థితికి చేరుకుంది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

యాసిడ్ ఆధారిత క్లీనర్లు, ప్రమాదకర రసాయనాలను పిల్లలకు అందకుండా భద్రపరచాలని, పొరపాటున మింగితే వెంటనే వైద్యులను సంప్రదించాలని డాక్టర్ లలిత్ కుమార్ రెడ్డి సూచించారు.

ఈ సందర్భంగా ఆసుపత్రి డైరెక్టర్ గోరుకంటి పవన్, యూనిట్ హెడ్ కె. శ్రీనివాస్ రెడ్డి, అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ చిదుర మాట్లాడుతూ.. అత్యాధునిక వైద్య సదుపాయాలతో క్లిష్టమైన శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు.

Sthanikam

పెద్దపేగుతో కొత్త ఆహార మార్గం.. యువతికి అరుదైన శస్త్రచికిత్స

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి