Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / సూర్యాపేట

నిందితులకు శిక్షలు పడేలా పనిచేసిన వారికి ఎస్పీ సత్కారం

Updated : 28 Nov 2026 19:37 IST
As Preferred Source 1 min read
నిందితులకు శిక్షలు పడేలా పనిచేసిన వారికి ఎస్పీ సత్కారం

కేసుల విచారణలో నిందితులకు శిక్షలు పడేలా కృషి చేసిన పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, పోలీసు సిబ్బందిని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ఘనంగా సత్కరించారు. న్యాయస్థానాల్లో సమర్థవంతంగా వాదనలు వినిపించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్లు రఘురామయ్య, లింగయ్య, సవిందర్, కళ్యాణిలకు ప్రశంసా పత్రాలు అందజేశారు. అలాగే కేసులకు సంబంధించి పటిష్టమైన ఆధారాలు సేకరించి చార్జిషీట్లు దాఖలు చేసిన సీఐలు శివశంకర్, సత్యంలను అభినందించారు. కోర్టు విధుల్లో భాగంగా సాక్షులు, బాధితులు, నిందితులను సకాలంలో హాజరుపరుస్తూ న్యాయస్థానాలతో సమన్వయం చేసిన హెడ్ కానిస్టేబుల్ వెంకన్నతో పాటు కానిస్టేబుళ్లు నాగబ్రహ్మం, యాసిన్, శివరాం, సైదులు, శోభన్‌బాబు, యాదగిరి, శ్రీనివాస్‌లను సన్మానించారు. ఈ సందర్భంగా కేసుల దర్యాప్తు నుంచి తీర్పు వరకు ప్రతి దశలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఎస్పీ సూచించారు.

Sthanikam

నిందితులకు శిక్షలు పడేలా పనిచేసిన వారికి ఎస్పీ సత్కారం

Article Image

కేసుల విచారణలో నిందితులకు శిక్షలు పడేలా కృషి చేసిన పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, పోలీసు సిబ్బందిని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ఘనంగా సత్కరించారు. న్యాయస్థానాల్లో సమర్థవంతంగా వాదనలు వినిపించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్లు రఘురామయ్య, లింగయ్య, సవిందర్, కళ్యాణిలకు ప్రశంసా పత్రాలు అందజేశారు. అలాగే కేసులకు సంబంధించి పటిష్టమైన ఆధారాలు సేకరించి చార్జిషీట్లు దాఖలు చేసిన సీఐలు శివశంకర్, సత్యంలను అభినందించారు. కోర్టు విధుల్లో భాగంగా సాక్షులు, బాధితులు, నిందితులను సకాలంలో హాజరుపరుస్తూ న్యాయస్థానాలతో సమన్వయం చేసిన హెడ్ కానిస్టేబుల్ వెంకన్నతో పాటు కానిస్టేబుళ్లు నాగబ్రహ్మం, యాసిన్, శివరాం, సైదులు, శోభన్‌బాబు, యాదగిరి, శ్రీనివాస్‌లను సన్మానించారు. ఈ సందర్భంగా కేసుల దర్యాప్తు నుంచి తీర్పు వరకు ప్రతి దశలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఎస్పీ సూచించారు.

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి