2027 జనగణనలో ప్రత్యేక ఓబీసీ కాలమ్, కులాల వారీ కోడ్‌లు కేటాయించాలని డిమాండ్
చౌటుప్పల్ స్థానికం ప్రతినిధి:
దేశవ్యాప్తంగా ఉన్న ఓబీసీల న్యాయమైన హక్కుల సాధన కోసం శనివారం న్యూఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో నిర్వహించిన ‘చలో ఢిల్లీ’ భారీ మహాధర్నాలో మునుగోడు నియోజకవర్గం నుంచి ఇ.ఎల్.వి. భాస్కర్ ఫౌండేషన్ చైర్మన్ ఇరగదిండ్ల భాస్కర్ పాల్గొన్నారు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పిలుపుమేరకు ఫౌండేషన్ సభ్యులు, యువత, మహిళలు, బీసీ సంఘాల నాయకులతో కలిసి ఆయన ఢిల్లీకి తరలివెళ్లారు.ఈ సందర్భంగా ఇ.ఎల్.వి. భాస్కర్ మాట్లాడుతూ.. దేశ జనాభాలో సగానికి పైగా ఉన్న ఓబీసీలకు సమగ్ర కులగణన ద్వారానే న్యాయం జరుగుతుందన్నారు. 2027 జనగణనలో ప్రత్యేక ఓబీసీ కాలమ్‌తో పాటు ప్రతి కులానికి ప్రత్యేక కోడ్ కేటాయించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే సానుకూలంగా స్పందించకపోతే దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
దేశంలోని 60కి పైగా బీసీ సంఘాల ప్రతినిధులు పాల్గొన్న ఈ మహాధర్నాకు స్వరాజ్ ఇండియా నేత యోగేంద్ర యాదవ్, మహారాష్ట్ర కాంగ్రెస్ నేత విజయ్ వడెట్టివార్, ఆర్జేడీ ఎంపీ సంజయ్ యాదవ్, ఐఎన్ఎల్‌డీ నేత అభయ్ చౌతాలా తదితరులు సంఘీభావం తెలిపి ప్రసంగించారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి